Kurnool: కర్నూలు ప్రభుత్వ కళాశాలలో ఘనంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు!

Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో సాంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ వ్రతం. మహిళా సిబ్బందికి ప్రత్యేక సన్మానం, తాంబూలాల అందజేత.

Update: 2026-08-20 12:06 GMT

Kurnool: కర్నూలు ప్రభుత్వ కళాశాలలో ఘనంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు!

Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వరలక్ష్మీ వ్రత కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల మహిళా సిబ్బంది అందరూ కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు కలగాలని, అలాగే కళాశాల మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.

వరలక్ష్మీ వ్రతం ప్రాధాన్యతను వివరిస్తూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమైనవని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బంది అందరినీ ప్రత్యేకంగా సన్మానించి, పసుపు, కుంకుమ, పూలు, తాంబూలం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సిబ్బందిని గౌరవించడం ద్వారా వారి సేవలను, కళాశాల అభివృద్ధిలో వారి పాత్రను గుర్తించినట్లవుతుందని పేర్కొన్నారు.

అలాగే మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు విద్యా రంగంలో కూడా కీలక పాత్ర పోషిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో చేస్తున్న కృషిని అభినందించారు.

కార్యక్రమం అనంతరం మహిళా సిబ్బంది పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని, కార్యక్రమం , ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ మరియు ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. నాగ స్వామి నాయక్, అధ్యాపకులు, మహిళా సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News