Nandyala: నంద్యాలలో అర్ధరాత్రి వైఎస్సార్ విగ్రహం తొలగింపు
Nandyala: నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాత విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో క్రేన్ సహాయంతో తొలగించారు.
Nandyala: నంద్యాలలో అర్ధరాత్రి వైఎస్సార్ విగ్రహం తొలగింపు
Nandyala: నంద్యాలలో అర్ధరాత్రి వైఎస్సార్ పాత విగ్రహం తొలగింపు.. కొత్త విగ్రహ ఏర్పాటుపై ఉత్కంఠ. శ్రీనివాస సెంటర్‌లో క్రేన్‌తో విగ్రహం తొలగింపు.. జూలై 8న జయంతి నాటికి కొత్త విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నాలు.
నంద్యాల పట్టణం శ్రీనివాస సెంటర్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాత విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో నాయకులు క్రేన్ సహాయంతో తొలగించారు. అనంతరం విగ్రహ శిథిలాలను ట్రాక్టర్‌లో తరలించారు.
గత మే 12న ధ్వంసమైన వైఎస్సార్ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఈ నెల 8న జరగనున్న వైఎస్సార్ జయంతి నాటికి ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చొరవతో తెనాలిలో కొత్త విగ్రహం తయారు చేయిస్తున్నట్లు సమాచారం.
అయితే కొత్త విగ్రహం ప్రతిష్ఠకు అవసరమైన ఆర్ అండ్ బి, మున్సిపల్ శాఖల అనుమతుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. అనుమతులు లేకుండానే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే వివాదాలు తలెత్తే అవకాశముందని చర్చ సాగుతోంది.
కొత్త విగ్రహ ఏర్పాటుపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై రాజకీయ వర్గాలతో పాటు స్థానిక ప్రజల్లో కూడా ఉత్కంఠ నెలకొంది.