Kurnool: కర్నూలులో ఓటరు జాబితా ప్రక్షాళన ముమ్మరం!

Kurnool: ఓటరు జాబితా ప్రక్షాళనలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అత్యంత కీలకమని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఈఆర్వో, నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.

Update: 2026-07-04 11:09 GMT

Kurnool: కర్నూలులో ఓటరు జాబితా ప్రక్షాళన ముమ్మరం!

కర్నూలు: కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక దశ అని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో), నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.

శనివారం ఆయన కుమ్మరిగేరి (218, 226), ఛత్రిబాగ్ (215), రాంబొట్ల గుడి (233, 237), అశోక్‌నగర్ (28, 29) పోలింగ్ బూత్‌ల పరిధిలో ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం బీఎల్‌వోలు, సూపర్వైజర్లు, అదనపు ఏఈఆర్వోలు, ఏఈఆర్వోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు విధులు కేటాయించిన యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని, అత్యల్ప పురోగతి నమోదైన పోలింగ్ బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జులై 14తో ఎన్యూమరేషన్ దశ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు చివరి వరకు వేచి ఉండకుండా తమ ఎన్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన సమర్పించాలని సూచించారు.

ఫారాలు అందకపోయినా, సమర్పించడంలో ఇబ్బందులు ఉన్నా లేదా ఏవైనా సందేహాలు ఉన్నా సంబంధిత బీఎల్‌వోను వెంటనే సంప్రదించాలని కోరారు. రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు కూడా బీఎల్‌వోలతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు రాజు, తిప్పన్న, నూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News