Mydukuru: కేసీ కెనాల్ నీటి కోసం రైతు సేవా సమితి రైతు గ్రామబాట!
Mydukuru: కేసీ కెనాల్ ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేయడాన్ని నిరసిస్తూ కడప జిల్లా రైతు సేవా సమితి ఆధ్వర్యంలో చాపాడు మండలం లక్ష్మీపేటలో రైతు గ్రామబాట నిర్వహించారు.
Mydukuru: కేసీ కెనాల్ నీటి కోసం రైతు సేవా సమితి రైతు గ్రామబాట!
Mydukuru: కేసి.కెనాల్ ఆయకట్టురైతుకు ఈ సంవత్సరం కరీఫ్ సీజన్లో ఏ విధమైన పంటలకు నీరు ఇవ్వమని అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కడప జిల్లా రైతు సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించే రైతు గ్రామబాట ఉద్యమ తొలిరోజు కార్యక్రమాన్ని ఈరోజు చాపాడు మండలం లక్ష్మిపేట గ్రామ రైతులతో గ్రామంలోని గంగమ్మ దేవాలయం ఆవరణలో సమావేశం నిర్వహించి అనంతరం గ్రామ రైతులతో కలిసి కేసీ.కెనాల్ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ధ్వార్సల గురువిరెడ్డి గారికి రైతుల సమస్యలతో కూడిన కరపత్రాన్ని అందజేసి రైతుల పక్షాన పోరాడాలని కోరడం జరిగిందనీ రైతు సేవాసమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ అన్నారు.
సమావేశంలో రైతు సంఘం అధ్యక్షుడు రమణమాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో నీరుఉన్న ఎల్లిననో పేరుతో త్రాగునీటి కోసమని ఆరుతడి పంటకు కూడా కెసి. ఆయకట్టుకు నీరు ఇవ్వమని ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం మరికేసి.
రైతును కరువు రైతుగా ప్రకటించి ప్రతి రైతుకు 30 వేల రూపాయలు సహాయం అంద జేయాలని భవిష్యత్తులో కడప జిల్లా కెసి. కెనాల్ రైతు ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల, జోలదరాశి ప్రాజెక్టులపూర్తికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రమణ కోరడం జరిగింది. పై సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వము స్పందించకపోతే కడప జిల్లా రైతు సేవా సమితి కేసీ.కెనాల్ రైతులు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రమణ అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సేవాసమితి మైదుకూరు నియోజకవర్గ అధ్యక్షుడు అన్నవరం వెంకటేశ్వర్లు, రైతు రిటైర్డ్ ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి, కేసి.కెనాల్ ఆయకట్టు ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ద్వార్శల గురువిరెడ్డి, లక్ష్మీపేటగ్రామ మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి, రైతు సేవా సమితి చాపాడు మైదుకూరు పట్టణ,మండల నాయకులు కాన గూడూరు రామ్మోహన్, చెక్పోస్ట్ శ్రీనివాసులు, దాసరెడ్డి గారి సుబ్బరాయుడు, నక్కలదిన్నె రామకృష్ణ, మామిళ్ళపల్లి సుబ్బరామయ్య ఎమ్మార్పీఎస్ నాయకులు మిద్దె వెంకటరమణ ,హరిబాబు తదితరులు పాల్గొన్నారు.