Rajampet: ‘ఇంటింటికీ తెలుగుదేశం’లో రికార్డు సృష్టించిన వెంకటరమణ
Rajampet: ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచారంలో సుండుపల్లి క్లస్టర్ ఇన్‌ఛార్జ్ వెంకటరమణ 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసి టీడీపీ ఇన్‌ఛార్జ్ చేతుల మీదుగా సత్కారం పొందారు.
Rajampet: ‘ఇంటింటికీ తెలుగుదేశం’లో రికార్డు సృష్టించిన వెంకటరమణ
రాజంపేట: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ (డోర్ టు డోర్) ప్రచార కార్యక్రమంలో సుండుపల్లికి చెందిన క్లస్టర్ ఇన్‌ఛార్జ్ లక్ష్మీంపల్లి వెంకటరమణ సరికొత్త రికార్డు సృష్టించారు.
తన పరిధిలోని మొత్తం 6,153 గృహాలను స్వయంగా సందర్శించి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ నూరు శాతం (100%) ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలోనే నిర్దేశిత లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేసిన మొట్టమొదటి క్లస్టర్‌గా లక్ష్మీంపల్లి వెంకటరమణ ఈ ఘనత సాధించారు.
ఘనంగా సన్మానించిన చమర్తి జగన్ మోహన్ రాజు
పార్టీ కార్యక్రమాన్ని అంకితభావంతో క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లిన లక్ష్మీంపల్లి వెంకటరమణను రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. రాజంపేట నియోజకవర్గ కార్యాలయంలో వెంకటరమణను శాలువాతో ఘనంగా సత్కరించి, ఆయన సేవలను కొనియాడారు.
కార్యకర్తలు, నాయకులు ఇదే స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విజయాలను ప్రతి గడపకూ చేరవేయాలని ఈ సందర్భంగా చమర్తి జగన్ మోహన్ రాజు పిలుపునిచ్చారు.