Kadapa: ఘనంగా ప్రారంభమైన ఎల్‌ఐసి 70వ బీమా వారోత్సవాలు

Kadapa: కడపలో ఎల్‌ఐసి 70వ బీమా వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి భారతీయ కుటుంబానికి ఎల్‌ఐసి నమ్మకమైన నేస్తమని డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మి కొనియాడారు.

Update: 2026-09-01 11:53 GMT

Kadapa: ఘనంగా ప్రారంభమైన ఎల్‌ఐసి 70వ బీమా వారోత్సవాలు

కడప: ప్రతి భారతీయ కుటుంబానికి ఎల్‌ఐసి నమ్మకమైన నేస్తమని, ఆపత్కాలంలో అండగా నిలిచే నిజమైన ఆపద్బంధువని డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జి. రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక ఎల్‌ఐసి డివిజనల్ కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభమైన 70వ బీమా వారోత్సవాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.

​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ఇన్సూరెన్స్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ఎల్‌ఐసి అని, గత ఏడు దశాబ్దాలుగా భారత సమాజం, దేశ ఆర్థిక వ్యవస్థపై సంస్థ చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. సంస్థ అభివృద్ధిలో సిబ్బంది, ఏజెంట్ల పాత్ర కీలకమని ప్రశంసిస్తూ, 'బీమా సఖి' కార్యక్రమం ద్వారా మహిళలను ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు.

​సీనియర్ డివిజనల్ మేనేజర్ (ఎస్‌డీఎం) ఎం.వి.కె.ఎస్. దుర్గాప్రసాద్ ఎల్‌ఐసి పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ.. కేవలం రూ.5 కోట్ల మూలధనంతో ప్రారంభమైన ఎల్‌ఐసి నేడు రూ.57.29 లక్షల కోట్ల ఆస్తులతో దేశ నిర్మాణంలో, క్లెయిమ్స్ చెల్లింపుల్లో అగ్రగామిగా నిలిచిందని వివరించారు. కడప డివిజన్ అన్ని వ్యాపార విభాగాల్లో గతేడాది కంటే అత్యుత్తమ పురోగతి సాధించిందని, పాలసీదారులు త్వరితగతిన సేవలందుకోవడానికి 'My LIC' యాప్‌ను వినియోగించుకోవాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో మేనేజర్లు బి. వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ శర్మ, కె.వి. వసంత గౌరి, ఫయాజ్ అహ్మద్, వెంకట కృష్ణలతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News