Nandyal: నంద్యాలలో వైసీపీ వర్సెస్ ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు
Nandyal: నంద్యాలలో ఏబీఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Nandyal: నంద్యాలలో వైసీపీ వర్సెస్ ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు
Nandyal: నంద్యాలలో మీడియా–రాజకీయాల ఉద్రిక్తత.. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై వైసిపి ఫిర్యాదు.. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం.. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్..
నంద్యాల జిల్లాలో మీడియా–రాజకీయాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వైఎస్ఆర్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్సీ ఇస్సాక్ భాష ఆధ్వర్యంలో వైసిపి నేతలు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.
విలువలు, విశ్వసనీయత లేకుండా వార్తలు ప్రసారం చేయడం దారుణమని వైసిపి నాయకులు విమర్శించారు. ముఖ్యంగా మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు.ఇంకా, “మా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్క మాట చెప్తే.. మీ ఛానల్ అడ్రస్ కూడా ఉండదు” అంటూ రాధాకృష్ణకు ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు.
తన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని వైసిపి శ్రేణులు హెచ్చరించాయి.
ఈ ఫిర్యాదును టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌కు ఎమ్మెల్సీ ఇస్సాక్ భాషతో పాటు, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పి.పి. మధుసూదన్ రెడ్డి, మహిళా నాయకులు సహా పలువురు వైసిపి నేతలు కలిసి అందజేశారు.