Parvathipuram: తప్పని డోలీ మోతలు.. 5 కిలోమీటర్లు మోసుకుంటూనే!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో అమానవీయ ఘటన! రోడ్డు సౌకర్యం లేక కోటకొండ గిరిజన యువకుడిని 5 కిలోమీటర్ల మేర డోలీలో మోసుకెళ్లిన గ్రామస్థులు.
Parvathipuram: తప్పని డోలీ మోతలు.. 5 కిలోమీటర్లు మోసుకుంటూనే!
పార్వతీపురం మన్యం జిల్లా: భామిని గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పడం లేదు. ప్రధానంగా రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వేళల్లో వైద్య సేవలు పొందేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. భామిని మండలం కోటకొండకు చెందిన పాలక సుమంతో స్పృహ తప్పిపడి పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు సవర్యలు చేశారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో గ్రామానికి చెందిన యువత డోలీ కట్టారు. సుమంతోను మోసు కుంటూ.. సుమారు ఐదు కిలోమీటర్ల మేర రాళ్లు తేలి దారిలో నడుచుకుని.. కాయమానుగూడ జంక్షన్కు చేరుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో సుమంతోకు స్పృహ రావడంతో తండ్రి రాజారావుతో గిరిజన యువత ఊపిరిపీల్చు కున్నారు. తిరిగి వారు గ్రామానికి చేరుకున్నారు. అయితే తివ్వకొండ శిఖర గ్రామాలైన కోటకొండ, కోసింగూడకు రహదారి లేకపోవడంతో గ్రామస్థుల్లో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా.. డోలీ మోతలు తప్పడం లేదని వారు వాపోయారు.
ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వారు వేడుకున్నారు.