Nalgonda: అప్పు తెచ్చి నీళ్లు కొంటున్నారు.. నల్గొండ రైతన్నల కన్నీటి గాథ!
Nalgonda: నల్గొండ జిల్లాలో సాగునీటి కరువు! ఎండిపోతున్న వరి పొలాలను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో రైతన్నల పోరాటం.
Nalgonda: అప్పు తెచ్చి నీళ్లు కొంటున్నారు.. నల్గొండ రైతన్నల కన్నీటి గాథ!
Nalgonda: నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రతకు సాగునీటి కష్టాలు ముదిరాయి. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వెలవెలబోతుండటంతో, చేతికొచ్చిన వరి పంటను దక్కించుకునేందుకు రైతులు ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. మునుగోడు, దేవరకొండ, తిరుమలగిరి సాగర్ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో 20 రోజుల నీటి తడులు అందితేనే పంట ఇంటికి చేరుతుందన్న ఆశతో, రైతన్నలు భారీ ఖర్చుతో నీటిని కొనుగోలు చేస్తూ పంటలను కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తాగు, సాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.