Nandyal: పవన్ కళ్యాణ్ గారు.. ఇప్పుడెక్కడ మీ సనాతన ధర్మం? డోన్ నేతల సూటి ప్రశ్న
Nandyal: నంద్యాల జిల్లా డోన్‌లో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నిరసన. అనైతిక కార్యకలాపాల ఆరోపణల నేపథ్యంలో ఆయనను వెంటనే తొలగించాలని డిమాండ్.
Nandyal: పవన్ కళ్యాణ్ గారు.. ఇప్పుడెక్కడ మీ సనాతన ధర్మం? డోన్ నేతల సూటి ప్రశ్న
నంద్యాల జిల్లా: డోన్ పట్టణంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు ను వెంటనే తొలగించాలని వైఎస్ఆర్సిపి శ్రేణులు నిరసన చేపట్టారు. చైర్మన్‌పై అనైతిక కార్యకలాపాల ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. సనాతన ధర్మం పేరుతో రాజకీయాలు చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై మౌనం వహించడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బి.ఆర్ నాయుడు పై చర్యలు తీసుకుని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.