Nellore: మార్కాపురం బస్సు ప్రమాదంలో ఉదయగిరి వాసి దుర్మరణం!
Nellore: మార్కాపురం బస్సు ప్రమాదంలో పొదలకూరుకు చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు మృతి. జగిత్యాల నుండి పండుగ కోసం వస్తుండగా విషాదం.
Nellore: మార్కాపురం బస్సు ప్రమాదంలో ఉదయగిరి వాసి దుర్మరణం!
వింజమూరు: మార్కాపురం బస్సు ప్రమాదం దుర్ఘటన లో పొదలకూరు లో నివాసం ఉంటున్న ముత్తంగి వెంకటేశ్వర్లు(46) దుర్మరణం. మృతుడు ఉదయగిరి మండలం దాసరపల్లి వాసి కాగా మూడేళ్ల క్రితం పొదలకూరు కు సమీపంలోని వెంకటేశ్వర నగర్ కు కాపురం వచ్చాడు.జగిత్యాల బేల్దారి పనుల కోసం వెళ్లి శ్రీరామ సందర్భంగ స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది సమాచారం తెలుసుకున్న భార్య మమత, కుమారుడు శ్రీ నాద్ మార్కాపురం వెళ్లారు. మృతుడు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వెంకటేశ్వర్లు రెండునెలల క్రితం జగిత్యాలకు బేర్దారి పనుల కోసం వెళ్లాడు. అతనితో పాటు ఉన్న దాసరిపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు గాయాలతో బయడపడ్డారు.