Mahabubnagar: అపార్ట్‌మెంట్‌లో వ్యభిచార దందా.. మహబూబ్ నగర్‌లో ఇద్దరు నిర్వాహకుల అరెస్ట్!
Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి. పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన నిర్వాహకుల అరెస్ట్.
Mahabubnagar: అపార్ట్‌మెంట్‌లో వ్యభిచార దందా.. మహబూబ్ నగర్‌లో ఇద్దరు నిర్వాహకుల అరెస్ట్!
Mahabubnagar: జిల్లా కేంద్రం లోని వ్యభిచార గృహం నడిపిస్తున్న నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ ఎజాజుద్దీన్ కదరం ప్రకారం నల్గొండ జిల్లాకు చెందిన సంతోష్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటున్నాడు ఆయన మిత్రుడు అంజి అలియాస్ ఆంజనేయులు నల్గొండ జిల్లా గుమ్మడిపల్లి కాగా స్థానికంగా సత్యమన్న కాలనీలో నివసిస్తున్నాడు. వీరు అశోక్ టాకీస్ సమీపంలో అపార్ట్మెంట్లో ప్లాట్ తీసుకొని ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలను రప్పించి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు పలువురికి వాట్సప్లో అమ్మాయిల చిత్రాలు పంపించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురిని ఆకర్షించే వారు వారం క్రిందట పోలీసులకు పక్క సమాచారం రావడంతో వెళ్లి దాడి చేశారు ఇద్దరు యువతులు ఐదుగురు విటులు పట్టుబడ్డారు. నిర్వాహకులు తప్పించుకోగా మంగళవారం వారిని అరెస్ట్ చేశారు సంతోష్ రెడ్డి పై రూలర్ పోలీస్ స్టేషన్లో రెండు వ్యభిచార కేసులు నమోదై ఉన్నట్లు సీఐ తెలిపారు.