Peddapalli: కూనారం టు కొండగట్టు హనుమాన్ మాలధారుల ఆధ్యాత్మిక యాత్ర

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామం నుండి 97 మంది హనుమాన్ స్వాములు దీక్ష విరమణ కోసం కొండగట్టు అంజన్న క్షేత్రానికి శోభాయాత్రగా బయలుదేరారు.

Update: 2026-04-02 13:12 GMT

Peddapalli: కూనారం టు కొండగట్టు హనుమాన్ మాలధారుల ఆధ్యాత్మిక యాత్ర

పెద్దపల్లి జిల్లా: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో భక్తిభావం వెల్లివిరిసింది. కూనారం గ్రామంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామానికి చెందిన అంజన్న స్వాములు పెద్ద ఎత్తున దీక్ష విరమణకు కొండగట్టుకు గ్రామం నుండి శోభాయాత్రగా బయలుదేరి వెళ్లారు.​41 రోజుల పాటు అత్యంత నిష్ఠతో హనుమాన్ దీక్షను చేపట్టిన 97 మంది స్వాములు, తమ దీక్షను విరమించేందుకు కొండగట్టుకు తరలి వెళ్లారు.కూనారం గ్రామం నుండి జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధికి ఈ స్వాములందరూ శోభయాత్రగా బయలుదేరారు. గ్రామంలో జై శ్రీరామ్, జై హనుమాన్ స్మరణలతో మార్మోగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు స్వాములకు ఘనంగా వీడ్కోలు పలికారు.

Tags:    

Similar News