Malakpet: ఇన్‌స్పెక్టర్ కె. నరసింహ సస్పెన్షన్.. సీపీ సంచలన నిర్ణయం!
Malakpet: మహిళా కానిస్టేబుల్ వేధింపులు, విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలతో మలక్‌పేట్ సీఐ కె. నరసింహను హైదరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు.
Malakpet: ఇన్‌స్పెక్టర్ కె. నరసింహ సస్పెన్షన్.. సీపీ సంచలన నిర్ణయం!
హైదరాబాద్ :- విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకుగాను
మలక్ పేట్ ఇన్సిపేక్టర్ నరసింహ పై సస్పెన్షన్ వేటు వేసిన నగర కొత్వాల్.
బ్రేకింగ్ న్యూస్: మలక్‌పేట్ ఇన్‌స్పెక్టర్ కె. నరసింహ సస్పెండ్
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మలక్‌పేట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కె. నరసింహను సస్పెండ్ చేశారు.
అందుతున్న సమాచారం ప్రకారం, గతంలో సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్‌ను వేధించారనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదని, అనంతరం ఆమె ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో శాఖాపరమైన చర్యలు ప్రారంభమైనట్లు సమాచారం.
అదే సమయంలో, మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకుని, వారికి ఒక కుమారుడు ఉన్నారని ఆరోపిస్తూ మొదటి భార్య కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ ఆరోపణలపై శాఖాపరమైన మరియు చట్టపరమైన విచారణ కొనసాగుతోంది.