Kukatpally: కూకట్‌పల్లిలో ఘోరం.. టిప్పర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి!

Kukatpally: కూకట్‌పల్లిలో స్కూటీని టిప్పర్ ఢీకొట్టిన ప్రమాదంలో క్రికెట్ ఆడేందుకు వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Update: 2026-07-26 05:47 GMT

Kukatpally: కూకట్‌పల్లిలో ఘోరం.. టిప్పర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి!

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం

కూకట్‌పల్లి: మారుతి సాగర్ రిపోర్టర్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతులు మహేష్ (17), లక్ష్మీ తేజ (17)గా గుర్తించారు. ఆదివారం క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తున్న ముగ్గురు యువకులను అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీని కూకట్‌పల్లి పోలీసులు సీజ్ చేశారు.

Tags:    

Similar News