Secunderabad: విఠలేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు!

Secunderabad: శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి, శ్రీ పెరుమాళ్ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

Update: 2026-07-25 14:20 GMT

Secunderabad: విఠలేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు!

సికింద్రాబాద్: పవిత్రమైన 'తొలి ఏకాదశి' పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే శ్రీగణేష్ మోండా డివిజన్ లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయం, శ్రీ పెరుమాళ్ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ పాండురంగ విఠలేశ్వరా స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ కు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని, లోక కళ్యాణం కోసం ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం డివిజన్ లోని శ్రీ పెరుమాళ్ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించుకొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వేద పండితులు ఎమ్మెల్యే కు వేద ఆశీర్వచనం అందజేసి, తీర్ధప్రసాదాలు అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియచేశారు. ఆ భగవంతుని కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్థిల్లాలని నియోజకవర్గం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News