Amangal: అమన్‌గల్ పీఎస్‌ను తనిఖీ చేసిన మహేశ్వరం ఏసీపీ జానకి రెడ్డి!

Amangal: రంగారెడ్డి జిల్లా అమన్‌గల్ పోలీస్ స్టేషన్‌ను మహేశ్వరం ఏసీపీ జానకి రెడ్డి తనిఖీ చేశారు.

Update: 2026-07-25 10:05 GMT

Amangal: అమన్‌గల్ పీఎస్‌ను తనిఖీ చేసిన మహేశ్వరం ఏసీపీ జానకి రెడ్డి!

Amangal: మహేశ్వరం డివిజన్ ఏసీపీ . జానకి రెడ్డి * అమన్‌గల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, విజిబుల్ పోలీసింగ్, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్ విజిటింగ్ నోట్‌లో పలు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు.

ఏసీపీ ఇచ్చిన ముఖ్యమైన సూచనలు:

- పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలి.

- గ్రేవ్ (UI) కేసుల ఛేదనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి.

- సైబర్ నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

- విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించాలి.

- రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి.

- CCTNS మరియు e-Sakshi వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించి దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచాలి.

- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్‌లో విస్తృతంగా ఉపయోగించాలి.

- సైబర్ భద్రత, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణ వంటి అంశాలపై నిరంతరం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

- పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి సక్రమంగా నిర్వహించాలి.

- స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా, హరితవనంగా ఉంచుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.

ఏసీపీ గారు అందించిన సూచనలను అమన్‌గల్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అమలు చేస్తూ, ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలను అందించేందుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News