Malkajgiri: మల్కాజిగిరిలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం!

Malkajgiri: మల్కాజిగిరి జవహర్ నగర్‌లో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్.

Update: 2026-08-22 12:19 GMT

Malkajgiri: మల్కాజిగిరిలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం!

Malkajgiri: ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్‌లో రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్ శ్రీకారం చుట్టారు.జవహర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కాలనీ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

కార్యక్రమంలో జవహర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నారాయణ,జాన్, ముత్యంరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,కాశి రెడ్డి, శ్రీశైలం, మాధవి, పద్మావతి, మల్లేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబు, సత్యనారాయణ, సంపత్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Tags:    

Similar News