Hyderabad: ఏసీబీకి చిక్కిన చందానగర్ ఎస్సై బాలరాజు, కానిస్టేబుల్ రాఘవేంద్ర!

Hyderabad: కేసులో అనుకూలంగా ఛార్జ్ షీట్ వేసేందుకు రూ.75 వేల లంచం తీసుకుంటూ చందానగర్ ఎస్సై బాలరాజు, కానిస్టేబుల్ రాఘవేంద్ర ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

Update: 2026-08-22 15:27 GMT

Hyderabad: ఏసీబీకి చిక్కిన చందానగర్ ఎస్సై బాలరాజు, కానిస్టేబుల్ రాఘవేంద్ర!

హైదరాబాద్: కేసు దర్యాప్తులో అనుకూలంగా వ్యవహరించి, ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు లంచం డిమాండ్‌ చేసిన చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై బండెల బాలరాజు, కానిస్టేబుల్‌ బొట్టా రాఘవేంద్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు.

ఫిర్యాదుదారుడి నుంచి రూ.75 వేల లంచం డిమాండ్‌ చేసి స్వీకరిస్తుండగా రంగారెడ్డి రేంజ్‌ ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్సై బాలరాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంలోని ఆయన టేబుల్‌ డ్రా నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా, అంతకుముందే ఎస్సై రూ.20 వేలు, కానిస్టేబుల్‌ రాఘవేంద్ర రూ.10 వేల నగదును డిజిటల్ చెల్లింపుల (UPI) ద్వారా స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

తన అధికారిక విధులను పక్కనపెట్టి, అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించిన ఈ ఇద్దరు అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. వీరిని హైదరాబాద్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు.

Tags:    

Similar News