Kapra: భావనాఋషి సొసైటీలో ప్లాట్ల యజమానులు బెటర్మెంట్ ఛార్జీలు చెల్లించాలి

Kapra: ఎఎస్ రావు నగర్ డివిజన్‌లోని భావనాఋషి హౌసింగ్ సొసైటీ అభివృద్ధికి ప్రతీ సభ్యుడు బెటర్మెంట్ ఛార్జీలు చెల్లించాలని సొసైటీ అధ్యక్షుడు సీత అంజనేయులు విజ్ఞప్తి.

Update: 2026-08-22 14:07 GMT

Kapra: భావనాఋషి సొసైటీలో ప్లాట్ల యజమానులు బెటర్మెంట్ ఛార్జీలు చెల్లించాలి

కాప్రా: కాప్రా సర్కిల్ పరిధి ఏఎస్ రావు నగర్ డివిజన్ లోని భావనాఋషి కో అవరెటివ్ హౌసింగ్ సోసైటీ(పద్మాశాలి టౌన్షిష్)లో ప్లాటు ఉన్న ప్రతి ఒక్కరు కాలనీ అభివృద్ధి కోసం బెటర్మెంట్ చార్జీలు చెల్లించాలని భావనాఋషి కో అపరెటివ్ హౌసింగ్ సోసైటి అధ్యక్షుడు సీత అంజనేయులు కోరారు.

శనివారం సోసైటి కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సోసైటి ఉపాధ్యాక్షులు అతినగరం సుదేష్, కార్యవర్గ సభ్యులు గుర్రం విశ్వేశ్వరరావు , కర్నాటి నాగభూషణంలతో కలసి ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసి నిభందనల ప్రకారం సోసైటి కాలనీ పరిదిలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ కు సంభదించి 18 వందల మంది సభ్యులు చెల్లించిన బెటర్మెంట్ చార్జీలతో అభివృద్ధి పనులను పూర్తి చేశామని తెలిపారు.

మరిన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు మిగిలిన సభ్యులు ప్రతి ఒక్కరు బెటర్మెంట్ చార్జీలు చెల్లించాలని తెలిపారు. సెప్టెంబర్ 20వ తేది లోపు చెల్లించిన వారికి రాయితీలు ఇవ్వబడుతుందని సభ్యులు ఈ అవకావాన్ని నద్వీనియోగం చేసుకోవాలని తెలిపారు.

బెటర్మెంట్ చార్జీలు చెల్లించాని వారికి సోసైటి బైలాస్ ప్రకారం సెల్ డిడ్ రద్దు చేసేందుకు కోర్ట్ లో కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సోసైటి ఎన్ ఓ సి లేకుండ కాలనీలో ప్లాట్లు కోనుగోలు చేయవద్దని కోరారు. కాప్రా సబ్ జిస్టార్ కార్యలయంలో, ఎంఎంసి కాప్రా సర్కిల్లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు ప్రతి సభ్యుడు బెటర్మెంట్ చార్జీలు చెల్లించి కాలని అభివృద్ధి పాటుపడాలని కోరారు.

Tags:    

Similar News