Eluru: వేలేరుపాడు మండలంలో వరుస చోరీల యత్నాలు భయాందోళనలో గ్రామస్తులు!

Eluru: వేలేరుపాడు మండలం రుద్రమకోటలో వరుస దొంగతనాల యత్నాలు, అనుమానితుల సంచారంతో గ్రామస్తులు తెల్లవార్లు గస్తీ కాస్తున్నారు. పోలీసులు రాత్రివేళల్లో సెర్చ్ నిర్వహించారు.

Update: 2026-08-14 07:23 GMT

Eluru: వేలేరుపాడు మండలంలో వరుస చోరీల యత్నాలు భయాందోళనలో గ్రామస్తులు!

Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల పరిధిలోని గ్రామాల్లో వరుస చోరీల యత్నాలు , అనుమానితుల సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల వెలేరుపాడు మండల కేంద్రంలోని సంత బజార్ లో కారం సీతయ్య ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని ఐదుగురు దుండగులు దోపిడీకి యత్నించారు. మండల పరిధిలోని రుద్రమకోట.

గ్రామానికి చెందిన మక్కిన వెంకటేశ్వర్లు, తన ఇంట్లో భార్య లక్ష్మి, కూతురు భవాని లతో గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిద్రిస్తుండగా కరెంటు పోయింది. అదే సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు వారి ఇంటి తలుపులు గట్టిగా కొడుతూ, తలుపులు నెట్టే ప్రయత్నం చేయడంతో భయంతో ఇంటిలోని వారు కేకలు వేయడంతో ఇరుగు పొరుగువారు అక్కడికి చేరుకోవడంతో దుండగులు పారిపోయారు. ఇళ్లలో దొంగతనాలకు యత్నాలు జరుగుతున్నాయని,

దొంగల బెడద నుంచి గ్రామాన్ని కాపాడుకునేందుకు గ్రామస్తులంతా ఏకమయ్యారు. సమాచారం తెలియడంతో వెలేరు పాడు గ్రామం నుండి కూడా కొందరు యువకులు అక్కడికి చేరుకుని చోరీకి యత్నించిన దుండగులను వెతికారు.

సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది గురువారం అర్ధరాత్రి నుంచి గస్తీ నిర్వహించారు. దుండగులు చోరీ చేసేందుకు యత్నించిన ఇంటిని పరిశీలించారు. గ్రామాల్లోకి అందరూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. రుద్రమ కోట గ్రామానికి చెందిన యువకులు, గ్రామస్తులు తెల్లవార్లు గస్తీ కాస్తూ ఊరికి కాపలా ఉంటున్నారు.

Tags:    

Similar News