Eluru: ఏలూరు జిల్లాలో ప్రేమపెళ్లి పేరుతో ప్రియురాలిని బేరం పెట్టారు!
Eluru: ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో ప్రేమ వివాహం పేరుతో ప్రియురాలిని బేరం పెట్టి 12 లక్షలు డిమాండ్ చేస్తున్న ప్రియుడి ఉదంతం కలకలం రేపింది.
Eluru: ఏలూరు జిల్లాలో ప్రేమపెళ్లి పేరుతో ప్రియురాలిని బేరం పెట్టారు.
ఏలూరు జిల్లా: ప్రేమపెళ్ళి పేరుతో ప్రియురాలిని బేరం పెట్టి 12 లక్షలు డిమాండ్ చేస్తున్న ప్రియుడు ఉదంతం
నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో కన్నకూతురు కోసం తీవ్ర మనోవేదనకు గురవుతున్న తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు.
గత నాలుగు రోజుల క్రితం ఏలూరు నగరంలో కాలేజీకి అనీ వెళ్ళిన యువతిని తీసుకువెళ్ళిన నలుగురు యువకులు.
బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన యువకుడు మధుకి, యువతి రాజేశ్వరిలకు వీరవల్లి పోలీస్ స్టేషన్ లో ప్రేమ వివాహాం జరిపించి ఇంటికి పంపించిన స్నేహితులు.
పెళ్ళినాటి నుండి కూతురు యోగక్షేమాలు తెలియక తీవ్ర కలవరం చెందుతున్న కుటుంబ సభ్యులు.
ప్రేమ పెళ్ళి అనంతరం ప్రియురాలి తల్లిదండ్రులతో బేరసారాలకు రంగంలోకి దిగిన యువకుడు మధు తరపు కొందరు వ్యక్తులు.
పది లక్షలు ఇస్తే అమ్మాయిని ఇంటి ముందు దింపి వెళ్ళిపోతామంటూ తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్.
కుమార్తె కోసం ఆరు లక్షల వరకు ఇచ్చేందుకు సిద్దపడి మీడియాను ఆశ్రయించిన రాజేశ్వరి తల్లిదండ్రులు.