Velerupadu: విధుల్లో నిర్లక్ష్యం బీట్ ఆఫీసర్ సస్పెన్షన్

Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పోడు భూముల ఆక్రమణను నివేదించడంలో నిర్లక్ష్యం వహించిన బీట్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసిన డీఎఫ్‌ఓ వెంకట సందీప్ రెడ్డి.

Update: 2026-08-05 08:28 GMT

Velerupadu: విధుల్లో నిర్లక్ష్యం బీట్ ఆఫీసర్ సస్పెన్షన్

వేలేరుపాడు: ఏలూరు జిల్లా కుక్కునూరు అటవీ రేంజ్ పరిధిలోని వేలేరుపాడు మండలంలోని రుద్రమకోట బీట్ అటవీ ప్రాంతాలలో విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన బీట్ ఆఫీసర్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా అటవీశాఖ అధికారి వెంకట సందీప్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల రుద్రమ కోట బీట్ పరిధిలోని పోచారం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోనూ, చింతలపాడు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నూతనంగా 30 - 40 ఎకరాలపైనే కొత్త పోడు నరికి అటవీ భూమిని ఆక్ర మించేందుకు కొందరు యత్నించారు.

ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు సకాలంలో అందించకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం వంటి కారణాలతో ఈ బీట్ లో విధులు నిర్వహిస్తున్న బీట్ అధికారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News