Kukunoor: కుక్కునూరులో సీతారాం ఏచూరి 74వ జయంతి వేడుకలు
Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరులో సీపీఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి 74వ జయంతి ఘనంగా నిర్వహణ. ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడిన నాయకులు.
Kukunoor: కుక్కునూరులో సీతారాం ఏచూరి 74వ జయంతి వేడుకలు
కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు సుందరయ్య భవనం ప్రజాసంఘాల కార్యాలయంలో సీపీఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి 74వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు యర్రంశెట్టి నాగేంద్రరావు, సీపీఎం మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీతారాం ఏచూరి గారు విద్యార్థి ఉద్యమం నుంచి జాతీయ రాజకీయాల వరకు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, శాస్త్రీయ ఆలోచనల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడారని తెలిపారు.
మతోన్మాద రాజకీయాలను, ప్రజలను మతాల పేరుతో విభజించే విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను ఐక్యం చేసేందుకు సీతారాం ఏచూరి చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ప్రజలు శాస్త్రీయ ఆలోచనలతో ముందుకు సాగుతూ మూఢనమ్మకాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలవాలని, కార్మికులు, రైతులు, పేదలు, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
సీతారాం ఏచూరి ఆశయాలను ఆచరణలో కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కారం రమేష్, దారా కృష్ణ, కాకా కిషోర్, పాంచాలి, తదితరులు పాల్గొన్నారు.