Kukunoor: కుక్కునూరు మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరాయిగూడెంలో ప్రభుత్వ భూముల కబ్జా. పట్టించుకోని రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు. స్థానికుల ఆందోళన.

Update: 2026-08-13 12:32 GMT

Kukunoor: కుక్కునూరు మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ

కుక్కునూరు: కుక్కునూరు మండలంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరాయిగూడెం పంచాయతి పరిధిలో సర్వే నంబర్ 147

లో సుమారు 5000 ఎకరాల ప్రభుత్వ భూమి కలదు. అందులో పెదరాయిగూడెం గ్రామ శివారులో సర్వే నంబర్ 147 లో ఉన్న సుమారు 170 ఎకరాల ప్రభుత్వ ఉండగా, అట్టి భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి జమాయిల్, జామ క్లోన్ నర్సరీలు ఏర్పాటు చేసి కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు.

ఇటీవల ఓ వ్యక్తి నర్సరీలను పెట్టేందుకు రెండు గుట్టల మధ్యలో ఎక్స్‌కవేటర్ తో ప్రభుత్వ భూమిని చదును చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పెదరాయిగూడెం సంబంధించిన ఈ ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని ఇటీవల కొంత మంది వ్యక్తులు చదును చేసి జమాయిల్, జామ క్లోన్ నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా యని రెవిన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదని పలువురు బహటంగానే చెబుతున్నారు.

కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమించి నర్సరీలు పెట్టేందుకు మెషిన్లతో మొద్దులు తీయించి, చదును చేస్తున్నారని రెవిన్యూ అధికారులకు సమాచారం ఇస్తే, అవి పారెస్టు భూములని చెబుతున్నారు. పారెస్ట్ అధికారులకు సమాచారం ఇస్తే, అవి రెవిన్యూ భూములని చెబుతున్నారే తప్ప ప్రభుత్వ భూముల ఆక్రమణలపై

స్పందించి ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్న ఆక్రమణ దారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఎవరైనా స్థానికంగా విధులు నిర్వహిస్తున్న అటవీ, రెవిన్యూ అధికారులను అడిగితె రెవిన్యూ, పారెస్ట్ భూముల సరిహద్దుల్లో స్పస్టత లేదని చెబున్నారు. కానీ రెవిన్యూ, పారెస్ట్ భూములు ఏవైనా ప్రభుత్వ భూములే కాబట్టి అక్రమణలను రెవిన్యూ, పారెస్ట్ అధికారులు ఎవరైనా నిలుపుదల చేసి ప్రభుత్వ

భూములను పరి రక్షించొచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 147లోని రెండు గుట్టల మధ్యలో ఇటీవల కాలంలో నర్సరీలు పెట్టేందుకు చదును చేసిన ప్రభుత్వ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను అధికారులు పరిశీలించి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమి హద్దులను స్పష్టంగా నిర్ధారించాలని గ్రామస్థులు కోరుతున్నారు. చదును చేసిన ప్రభుత్వ భూమిపై విచారణ జరిపి, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడి అక్రమణదారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News