Nellore: ఆస్తి గొడవ.. ఆసుపత్రి పాలు ఏఎస్ పేట మండలంలో దారుణం!

Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం పెద్దఅబ్బీపురంలో భూ వివాదం కారణంగా అన్నదమ్ముల మధ్య ఘర్షణ. గొడ్డలి, కర్రలతో దాడి చేయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు.

Update: 2026-03-25 13:59 GMT

Nellore: ఆస్తి గొడవ.. ఆసుపత్రి పాలు ఏఎస్ పేట మండలంలో దారుణం!

Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం పెద్దఅబ్బీపురం గ్రామంలో భూ వివాదంతో అన్నదమ్ముల మధ్య చెలరేగిన వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది. అన్నదమ్ముల మధ్య భూ వివాదం హింసకు దారి తీసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గత కొంతకాలంగా ఇరువురి మధ్య భూ పంపకాల విషయంలో కొనసాగుతున్న నేడు మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది దీంతో ఊసా మధుసూదన్ రావు, ఉసా కొండయ్య లపై ఊసా సంగయ్య అతని కుమారులు ఒక్కసారిగా వారిపై గొడ్డలి,కర్రలతో దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.ఈ దాడిలో మధుసూదన్ రావుకు తీవ్ర గాయాలు కాగా ఊసా కొండయ్యకు స్వల్ప గాయాలయ్యాయి.

గాయపడిన వారిని వెంటనే 108 వాహనం ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏ ఎస్ పేట ఎస్ఐ సైదులు తన సిబ్బందితో కలిసి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని అన్నదమ్ముల మధ్య భూ వివాదం కారణంగానే ఈ దాడి జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News