Madanapalle: ఆరోగ్యవరం వద్ద వైసీపీ ఘన స్వాగతం
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పర్యటనకు విచ్చేసిన మాజీ మంత్రి,పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆరోగ్యవరం వద్ద వైసీపీ శ్రేణుల ఘన స్వాగతం.
Madanapalle: ఆరోగ్యవరం వద్ద వైసీపీ ఘన స్వాగతం
మదనపల్లె: పర్యటన భాగంగా విచ్చేసిన మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కు ఆరోగ్యవరం వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ మదనపల్లె నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఏపీఎండీసీ సీనియర్ నాయకులు దండాల రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా ఆహ్వానించారు.
అభిమానుల నినాదాల మధ్య మాజీ మంత్రికి ఘన స్వాగతం లభించగా, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, నాయకులు మాజీ మంత్రితో కొద్దిసేపు సమావేశమై నియోజకవర్గ పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. మదనపల్లె పర్యటన విజయవంతం కావాలని వైసీపీ నాయకులు ఆకాంక్షించారు.