Madanapalle: మదనపల్లె ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన హర్షవర్ధన్ రెడ్డి!
Madanapalle: బక్రీద్ పర్వదినం సందర్భంగా మదనపల్లె ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి.
Madanapalle: మదనపల్లె ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన హర్షవర్ధన్ రెడ్డి!
మదనపల్లె: పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని మదనపల్లె నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులందరికీ మదనపల్లె వైసీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, త్యాగం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు. మత సామరస్యాన్ని, సోదరభావాన్ని మరింత బలోపేతం చేసే ఈ పవిత్ర పర్వదినం అందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు తీసుకురావాలని కోరారు. ముస్లిం సోదరుల ప్రార్థనలు రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు దోహదపడాలని హర్షవర్ధన్ రెడ్డి అభిలషించారు.