Madanapalle: ఇది మెగా డీఎస్సీ కాదు.. మెగా స్కామ్
Madanapalle: మదనపల్లె అంబేద్కర్ సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో “దగా డీఎస్సీ” నిరసన.
Madanapalle: ఇది మెగా డీఎస్సీ కాదు.. మెగా స్కామ్
మదనపల్లె: అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో “దగా డీఎస్సీ”కి వ్యతిరేకంగా శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర చక్రధర్ మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ఇది “మెగా డీఎస్సీ కాదు.. మెగా స్కామ్” అని విమర్శించారు. జిల్లా అధ్యక్షులు జంగం రెడ్డి కిషోర్ దాస్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
డీఎస్సీ ప్రక్రియపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు. అలాగే రాష్ట్ర కార్యదర్శి కళ్యాణ్ భరత్, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశోక్ రాయల్, నాయకులు హేమంత్, అభిలాష్ రెడ్డి, లోకనాథం, పూర్ణచంద్ర, గిరీష్, ద్వారకనాథ్ రెడ్డి, నరేష్, ప్రశాంత్, ఆఫ్రిత్, షేక్ మౌలాలి, రావూరి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.