Madanapalle: మదనపల్లెలో ఘనంగా మహాభారత యజ్ఞం: కనువిందు చేసిన కృష్ణ లీలలు
Madanapalle: మదనపల్లె నీరుగట్టువారిపల్లెలో 18 రోజుల పాటు జరిగే మహాభారత యజ్ఞం ఘనంగా ప్రారంభమైంది.
Madanapalle: మదనపల్లెలో ఘనంగా మహాభారత యజ్ఞం: కనువిందు చేసిన కృష్ణ లీలలు
Madanapalle: మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో బీజేపీ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మహాభారత యజ్ఞం ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. గురువారం నుంచి ప్రారంభమైన ఈ యజ్ఞం మొత్తం 18 రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహాభారత యజ్ఞం తొలి రోజు సందర్భంగా రాత్రి నిర్వహించిన శ్రీకృష్ణ లీలలు – కంస్య వధ నాటకం భక్తులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీకృష్ణుడి బాల్యలీలలు, కంసుడి వధ ఘట్టాలను కళాకారులు అద్భుతంగా ప్రదర్శించగా, కార్యక్రమానికి హాజరైన భక్తులు, స్థానిక ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. నాటక ప్రదర్శనలో భక్తి భావనతో పాటు ఆధ్యాత్మిక సందేశాలు ప్రతిబింబించడంతో ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో రామారావు కాలనీ చేనేత నాయకులు పురం సహదేవ్, దారే పారాశి తదితరులు పాల్గొన్నారు. మహాభారత యజ్ఞాన్ని విజయవంతం చేయాలని, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షించాలని నిర్వాహకులు ఆహ్వానించారు.