Nellore: బడుగుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్.. ఎమ్మెల్యే సోమిరెడ్డి నివాళి

Nellore: నెల్లూరులో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Update: 2026-04-05 09:03 GMT

Nellore: బడుగుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్.. ఎమ్మెల్యే సోమిరెడ్డి నివాళి

Nellore: పీడిత, అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాటాలు చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ అని అన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు తపించిన గొప్ప వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. బాబూ జగ్జీవన్ రామ్ పోరాటాలు, ఆలోచనలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం అని, బాబూ జగ్జీవన్ రామ్ సేవలను మననం చేసుకుంటూ వారి దివ్యస్మృతికి ఘన నివాళులర్పిస్తున్నాం అని చెప్పారు ఎమ్మెల్యే సోమిరెడ్డి.

నెల్లూరు నగరం, వేదాయపాలెం సెంటర్ వద్దనున్న బాబూ జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రావ్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్ రామ్ గారి విగ్రహంతో పాటు, జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పొలిట్బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఎస్సీ కమీషన్ సభ్యులు శ్రీపతి బాబు, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రవణయ్య తదితర టీడీపీ నేతలతో కలిసి శాసనమండలి సభ్యులు నెల్లూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు బీద రవిచంద్ర పూలమాలలతో నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర మాట్లాడుతూ..

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, జగ్జీవన్ రామ్ వంటి మహనీయులు పుట్టిన పుణ్యమాసం ఏప్రిల్ అని, భారతదేశంలో పీడిత వర్గాల హక్కుల కోసం పోరాటాలు చేసి కీలక మార్పులకు నాంది పలికిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ అని చెప్పారు.

జగ్జీవన్ రామ్ వేడుకలను వారి జయంతి నాటి నుండి ఏప్రిల్ 14 వరకు పండుగ దినాలు గా దేశ ప్రజలు, బడుగు వర్గాలు జరుపుకుంటారని గుర్తు చేశారు..బడుగుల హక్కులను కాపాడేందుకు, సమాజాన్ని చైతన్య పరిచేందుకు బాబూ జగ్జీవన్ రామ్ ఉద్యమించారని అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలను సాధించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు బీద రవిచంద్ర.

Tags:    

Similar News