Beeda Masthan Rao: పాండిచ్చేరి బోట్ల తరలింపు వ్యవహారంలో బిఎంఆర్ సంచలన వ్యాఖ్యలు!
Beeda Masthan Rao: పాండిచ్చేరి బోట్ల తరలింపు వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలపై రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు (BMR) ఘాటుగా స్పందించారు.
Beeda Masthan Rao: పాండిచ్చేరి బోట్ల తరలింపు వ్యవహారంలో బిఎంఆర్ సంచలన వ్యాఖ్యలు!
Beeda Masthan Rao: పాండిచ్చేరి బోట్ల వ్యవహారం పై నేరుగా స్పందించారు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు..బోట్ల తరలింపు వ్యవహారంలో వస్తున్న ఆరోపణలు పై బిఎంఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు..
సముద్ర తీర మత్స్యకారులు, తాను పూర్తిగా నమ్మే శ్రీరామచంద్రుడి సాక్షిగా.. బోట్ల తరలింపుతో తనకు సంబంధం లేదన్నారు మస్తాన్ రావు.. బోట్ల తరలింపులో దోషులను తేల్చాలని ఇప్పటికే కేంద్ర స్థాయి బృందాలను కోరానని చెప్పారు..మత్స్యకార బోట్ల తరలింపులో తనపై ఆరోపణలు నిజమైతే రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ పదవులకు, చివరకు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని ఆవేదన వ్యక్తం చేశారు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు.
పాండిచ్చేరి బోట్లు విడుదల చేయించినట్లు నాపై అభియోగాలు చేస్తున్నారని, తన రాజకీయ ఎదుగుదలకు మత్స్యకారులే కారణం అని, గుర్తు చేశారు బీద మస్తాన్ రావు.. బోట్ల చోరీపై దర్యాప్తు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు.. బోట్ల యజమానులు కావలి లాడ్జిలో ఉంటూ బోట్లు రిపేర్ చేయించుకున్నట్లు తెలిసిందని.. ఇస్కపల్లి కాపు తోటయ్య దగ్గర ఉన్న తాళాలు, పాండిచ్చేరి బోట్ల యజమానులు దగ్గరికి ఎలా వెళ్ళాయని బీద మస్తాన్ రావు ప్రశ్నించారు.
స్థానికుల సహకారం లేకుండా బోట్లు చోరీ కావడం అసాధ్యం అని, కావాలనే కొందరు పనిగట్టుకుని ఈ వివాదంలోకి తనని అనవసరంగా లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీద మస్తాన్ రావు.. శ్రీరాముని సాక్షిగా ఇవన్నీ అపోహలని.. హైలెవల్ కమిటీ వెయ్యమని ప్రభుత్వాన్ని కోరానని చెప్పారు.. సొంత గ్రామంలో ఉండే మత్సకారులతో తాను ఎందుకు జగడం పెట్టుకుంటానని చెప్పుకొచ్చారు.. బోట్ల చోరీ వ్యవహారంలో తన ప్రమేయం ఉందని తేలితే.. ఇప్పటికిప్పుడే రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తానని చెప్పారు బీద మస్తాన్ రావు.