Palakonda: జనంలోకి ఎమ్మెల్యే.. కొత్త కాలువల నిర్మాణానికి నిధుల గ్రీన్ సిగ్నల్!
Palakonda: పాలకొండ నగర పంచాయతీలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పర్యటన. మురుగు కాలువల మరమ్మతులకు నిధుల మంజూరు.
Palakonda: జనంలోకి ఎమ్మెల్యే.. కొత్త కాలువల నిర్మాణానికి నిధుల గ్రీన్ సిగ్నల్!
పార్వతీపురం మన్యం జిల్లా: ఈరోజు ఉదయం పాలకొండ నగర పంచాయతీ గారమ్మ కోలని, గటాలు డెప్పి వీధి, పాత బస్టాండ్ రోడ్డు, పెద్ద, చిన్న కాపు వీధి, కస్పా వీధి, పోతుల గడ్డ ఛానల్, తంపర ఛానల్ మరియు ఆక్రమణలు జరిగిన ప్రదేశాలని పరిశీలించిన శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయక్రిష్ణ గారు పర్యటించారు.
నగర పరిశుభ్రత & మురికి కాలువలు పట్టణంలో ఉన్న మురికి కాలువలు (drainage) తీవ్రంగా దెబ్బతిన్నాయి.
చెత్త, మురుగు నీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
వెంటనే శుభ్రపరిచే పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశించిన MLA జయ క్రిష్ణ గారు.
పాత కాలువలను మరమ్మతులు చేసి, కొత్త కాలువలు నిర్మించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ పనుల కోసం ప్రత్యేక గ్రాంట్ తక్షణమే మంజూరు చేస్తాను అని చెప్పారు
ప్రజలకు ఆరోగ్య సమస్యలు (డెంగ్యూ, మలేరియా వంటి) వచ్చే ప్రమాదం ఉంది.హైజీన్ మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఆక్రమణకు గురైన ఇరిగేషన్ కాలువలు వెంకటరాయని కోనేరు అవుట్ ఫ్లో ఆక్రమనలను పరిశీలించి తక్షణం ఆక్రమణ దారులకు నోటీసులు అందచేయాలనీ అధికారులకు ఆదేశించారు.