Nellore: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు నెల్లూరు బీజేపీ నేతల ఫిర్యాదు!

Nellore: నెల్లూరులో ధాన్యం ధరల పతనంపై మంత్రి నాదెండ్ల మనోహర్‌కు బీజేపీ నేత మిడతల రమేష్ ఫిర్యాదు. తేమ పేరుతో మిల్లర్ల దోపిడీ, గన్నీ బ్యాగుల కొరతపై చర్చ.

Update: 2026-03-30 05:41 GMT

Nellore: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు నెల్లూరు బీజేపీ నేతల ఫిర్యాదు!

Nellore: నెల్లూరు జిల్లాలో ధాన్యం ధరలు పతనంకు గల కారణాలను, నెల్లూరు విచ్చేసిన, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వివరించారు బిజెపి నేతలు....

కొనుగోలు కేంద్రాల వద్ద తేమ పేరుతో.. పుట్టి ధాన్యానికి, మిల్లర్లు 120 కేజీలు అదనంగా తీసుకుంటున్నారని చెప్పారు.

మూడు వారాలకు ముందు జిల్లాలో అన్ని రకాల ధాన్యానికి బహిరంగ మార్కెట్లో మద్దతు ధర లభించిందని, నేడు ఆ ధరలు పతనమయ్యాయని బిజెపి నేత మిడతల రమేష్ మంత్రికి వివరించారు..

అదే నేడు పుట్టి ధాన్యం, నాలుగు వేల నష్టానికి రైతుల విక్రయించుకుంటున్నారని తెలిపారు..

రైతుల కొనుగోలు కేంద్రాలకు వద్దకు వెళితే అక్కడ గన్నీ బ్యాగులు ఉండవని, లారీలు దొరకవని, కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు పోయిన ధాన్యాన్ని దించడానికి ఒక వారం రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని వివరించారు.

అందువల్లనే రైతుల బ్రోకర్లను ఆశ్రయించి ధాన్యాన్ని నష్టాలకు అమ్ముకుంటున్నారని చెప్పారు.

మిల్లర్లు 65 కోట్ల బ్యాంకు గ్యారంటీలు తీసుకున్నా. నామమాత్రంగా, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం సేకరిస్తున్నారని చెప్పారు. సిఎంఆర్ రైస్ కొరకు ధాన్యం సేకరిస్తే.. కరెంటు చార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదని, మిల్లర్లు ధాన్యాన్ని సేకరించడం లేదని చెప్పారు.

తేమ పేరుతో రైతులు నష్టపోకుండా శాశ్వత పరిష్కారం కొరకు , మొబైల్ పాడీ డ్రయ్యేర్ ను, రైతులు కు సబ్సిడీ తో అందించాలని మంత్రికి రమేష్ వివరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు కందికట్ల రాజేశ్వరి, నరాల సుబ్బారెడ్డి, సృజన. విజయ శ్రీ, నాగలక్ష్మి, పద్మ, ఏవి సుబ్బయ్య, ఆదినారాయణ, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News