Palakonda: పాలకొండలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు.

Update: 2026-04-05 09:52 GMT

Palakonda: పాలకొండలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన

Palakonda: పాలకొండ నగర పంచాయతీలో రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. పాలకొండ పట్టణంలో మంత్రి నారాయణ కార్లో సుడిగాలి  పర్యటన చేశారు. ముందుగా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోటదుర్గ అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభం తో స్వాగతం పలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్ధ ప్రసాదాలు మంత్రి కి అందించారు.

పట్టణంలో పోతుల గెడ్డ, డంపింగ్ యార్డు, వెంకట్రాయుడు కోనేరు ప్రాంతాలను పరిశీలించారు. నగర పంచాయతీ కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జెయింట్ కలెక్టర్, నగర పంచాయతీ ప్రత్యేక అధికారి స్వప్నల్ పవార్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, టీడీపీ నియోజికవర్గ ఇంచార్జ్ పడాల భూదేవి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News