Atmakur: ఆత్మకూరులో ముమ్మరంగా కార్టన్ సెర్చ్

ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని ఏసిఎస్ఆర్ నగర్ లో ఆత్మకూరు డిఎస్పి వేణుగోపాల్ ఆద్వర్యంలో ఆత్మకూరు సీఐ గంగాధర్,సంఘం 4 మంది ఎస్సై లు,40 మంది సిబ్బంది ముమ్మరంగా కార్టన్ సెర్చ్ నిర్వహించారు.

Update: 2026-03-25 14:50 GMT

ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని ఏసిఎస్ఆర్ నగర్ లో ఆత్మకూరు డిఎస్పి వేణుగోపాల్ ఆద్వర్యంలో ఆత్మకూరు సీఐ గంగాధర్,సంఘం 4 మంది ఎస్సై లు,40 మంది సిబ్బంది ముమ్మరంగా కార్టన్ సెర్చ్ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వాజెండ్ల ఆదేశాల మేరకు ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి..అనుమానాస్పద వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

తనిఖీల్లో 31బైకులు,4 ఆటోలను సీజ్ చేశారు. అనంతరం కాలనీ వాసులకు రోడ్డు భద్రత,నేరాల నియంత్రణ,మహిళల రక్షణ చట్టాలపై ఆత్మకూరు డిఎస్పి వేణుగోపాల్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్టన్ సెర్చ్ నిరంతరం కొనసాగుతుందనీ అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వాహన శోధకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు.

Tags:    

Similar News