Markapuram Bus Accident: మార్కాపురం బస్సు ప్రమాదం.. సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష..
Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Markapuram Bus Accident: మార్కాపురం బస్సు ప్రమాదం.. సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష..
Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన మంత్రులు అనిత, జనార్దన్ రెడ్డి మరియు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు ప్రమాదం జరిగిన తీరును ఫోన్ ద్వారా సీఎంకు వివరించారు.
13 మంది మృతి.. స్టీరింగ్ స్ట్రక్ అవ్వడమే కారణమా?
అధికారులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం చెందగా, 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని జగిత్యాల నుంచి వస్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది.
బస్సు డ్రైవర్‌ను ప్రాథమికంగా విచారించగా, ప్రయాణంలో ఒక్కసారిగా స్టీరింగ్ స్ట్రక్ (Steering Stuck) అవ్వడం వల్లే ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని మరియు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బస్సు జగిత్యాల నుంచి బయల్దేరిన నేపథ్యంలో, ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరించాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు తెలంగాణ సీఎస్, ఏపీ సీఎస్‌తో మాట్లాడి సహాయక చర్యలపై సమన్వయం చేసుకుంటున్నారు.