Kovur: మత్స్యకారుల కష్టం తీరనుంది.. ఫిషింగ్ జెట్టీకి రంగం సిద్ధం!

Kovur: కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం పొన్నపూడి పాతూరులో మినీ ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి కేంద్ర బృందం పరిశీలన.

Update: 2026-03-25 15:23 GMT

Kovur: మత్స్యకారుల కష్టం తీరనుంది.. ఫిషింగ్ జెట్టీకి రంగం సిద్ధం!

Kovur: కోవూరు నియోజకవర్గ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్ల చొరవతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఐసీఈఎఫ్ (CICEF) బృందం బుధవారం మినీ ఫిషింగ్ జెట్టీ నిర్మాణ సాధ్యా సాధ్యాలను పరిశీలించేందుకు విడవలూరు మండలంలోని పొన్నపూడి పాతూరు, పైడేరు ప్రాంతాల్లో పర్యటించింది.

ఈ సందర్భంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్ర బృందం ముఖ్యంగా పైడేరు క్రీక్ వద్ద సముద్ర ముఖద్వారం ఇసుక మేటలతో మూసుకుపోవడం వల్ల పడవల రాకపోకలకు అంతరాయం వుందని గుర్తించింది. సముద్రంలోకి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులు బృందానికి వివరించారు.

విడవలూరు మండలంలోని పొన్నపూడి పాతూరులో మినీ ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అసెంబ్లలో ప్రస్తావించడంతో పాటు మంత్రి అచ్చం నాయుడు గారికి మరియు మత్స్యశాఖ కమిషనర్ రవి శంకర్ నాయక్ ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

పొన్నపూడి పాతూరులో జెట్టి నిర్మాణానికి సంబంధించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర మత్స్యశాఖకు ఇప్పటికే లేఖ రాయగా. మినీ ఫిషింగ్ జెట్టీ నిర్మాణ సాధ్యా సాధ్యాలను పరిశీలించేందుకు విడవలూరు మండలంలోని పొన్నపూడి పాతూరు పర్యటనకు సీఐసీఈఎఫ్ డైరెక్టర్‌ నేతృతంలో కేంద్ర బృందం వచ్చింది.

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు మత్స్యకార సంఘ నాయకులు ఆవుల వాసు గారి ఆధ్వర్యంలో స్థానిక మత్స్యకార పెద్దలతో కలిసి సీఐసీఈఎఫ్ డైరెక్టర్‌ గారికి మెమొరాండం సమర్పించారు. పొన్నపూడి పాతూరులో జెట్టీ నిర్మాణం ద్వారా సుమారు 370 పడవలకు సురక్షిత నిల్వ సౌకర్యం లభించడమే కాకుండా చేపల అన్‌లోడింగ్, మార్కెటింగ్ కార్యకలాపాలు సులభతరం కానున్నాయి.

ఈ మినీ చెట్టు నిర్మాణం ద్వారా పైడేరు క్రీక్ పరిసరాల్లోని 12 గ్రామాలకు చెందిన దాదాపు 1750 కుటుంబాల్లో 6000 మంది మత్స్యకారులకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. తుఫానులు ఇలాంటి ప్రకృతి విపరీత్యాల సమయంలో పడవలకు రక్షణ కల్పించడంలో జెట్టీ కీలక పాత్ర పోషించనుంది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వాసు, ఆవుల రవీంద్ర, రవిచంద్ర, జేజ్జి చిన్నిబాబు, బాబు, చిట్టి తదితరులతో పాటు మత్స్యశాఖ ఏడి చాన్ భాష, ఎఫ్డీఓ సురేష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News