Atmakur: నష్టాల్లో మద్యం షాపులు..అధికారులకు గోడు వెళ్లబోసుకున్న ఓనర్లు
Atmakur: ఆత్మకూరు ఎక్సైజ్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శంకరయ్య సమీక్ష. మద్యం విక్రయాల టార్గెట్లపై యజమానుల నిరసన.
Atmakur: నష్టాల్లో మద్యం షాపులు..అధికారులకు గోడు వెళ్లబోసుకున్న ఓనర్లు
Atmakur: ఆత్మకూరు ఎక్సైజ్ కార్యాలయానికి శంకరయ్య డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ నెల్లూరు, దయాసాగర్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ నెల్లూరు విచ్చేశారు ఈ సందర్భంగా బ్రాందీ షాప్ యజమానులను పిలిసి ప్రతినెల మీకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం మద్యం కొనుగోలు చేయాలని తెలిపారు.
అయితే బ్రాందీ షాప్ యజమానులు తమకు టార్గెట్లు పూర్తి చేయడానికి తగినంతగా మద్యం అమ్ముడుపోవడం లేదని ప్రస్తుతం ప్రతి షాప్ యజమాని నష్టాలలో కూరుకుపోతున్నామని తమ బాధను వారి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వరమే మీకు న్యాయం చేసేందుకు మా వంతు కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు.
దీంతో తృప్తి పడిన బ్రాందీ షాప్ యజమాని సురా భాస్కర్ రెడ్డి శాలువాతో అధికారులకు చిరు సత్కారం చేశారు. అనంతరం పట్టణంలో ఉన్న ప్రతి పద్యం షాప్ ను సందర్శించి అక్కడ ఉన్న పర్మినెంట్ రూముల వద్ద శుభ్రతను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎక్సైజ్ కిషోర్ సిబ్బంది పాల్గొన్నారు.