Gannepalli: కేంద్ర పథకాలే మన ఆయుధాలు.. బీజేపీ సదస్సులో నేతల పిలుపు!
Gannepalli: ఉదయగిరి మండలం గన్నేపల్లిలో బీజేపీ ప్రశిక్షణ మహా అభియాన్-2026 నిర్వహణ. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కార్యకర్తలకు శిక్షణ.
Gannepalli: కేంద్ర పథకాలే మన ఆయుధాలు.. బీజేపీ సదస్సులో నేతల పిలుపు!
Gannepalli: నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గన్నేపల్లి లోని శ్రీ అడివి పేరంటాల అమ్మ కళ్యాణ మండపంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో పండిట్ దినదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజలకు అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి, ప్రతి లబ్ధిదారునికి చేరేలా ఎలా పని చేయాలన్న దానిపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.పార్టీ బలోపేతం, బూత్ స్థాయి నిర్వహణ, ప్రజలతో మమేకం కావడం, కేంద్ర పథకాల ప్రయోజనాలను వివరించడం వంటి అంశాలపై నేతలు ప్రసంగించారు.
అలాగే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు క్రమశిక్షణతో, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.