Nagulapadu: దశాబ్దాల సమస్య పరిష్కారం.. ప్రజల కల సాకారం

Nagulapadu: ఆత్మకూరు మండలం నాగులపాడు గ్రామస్థుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. సాగునీటి కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.

Update: 2026-03-31 13:41 GMT

Nagulapadu: దశాబ్దాల సమస్య పరిష్కారం.. ప్రజల కల సాకారం

Nagulapadu: ఆత్మకూరు మండలం నాగులపాడు గ్రామ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కీలక సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గ్రామానికి సమీపంలో ఉన్న ఆత్మకూరు సాగునీటి కాలువపై బ్రిడ్జి నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుతూ వస్తుండగా, వారి ఆకాంక్షను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెరవేర్చారు.

గ్రామ ప్రజల సమస్యను గమనించిన మంత్రి ఆనం రూ.40 లక్షల నిధులను మంజూరు చేసి, కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు, వ్యవసాయ పనులు, పంటల రవాణా మరింత వేగంగా సాగేందుకు దోహదపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కాలువ దాటడంలో ఎదురయ్యే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు కాలువ కారణంగా విద్యార్థులు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారని, ఈ బ్రిడ్జి వారి జీవితాలను సులభతరం చేస్తుందని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు యంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, నాగులపాడు టిడిపి నాయకులు నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో గ్రామ నాయకులు, ప్రజలు కలిసి మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నాగులపాడు గ్రామంలో ఈ నిర్ణయంపై ఆనంద వాతావరణం నెలకొని, మంత్రి ఆనం పట్ల ప్రజలు కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News