Pamidhi: వైఎస్సార్‌సీపీ నిరసన ఇది 'మెగా డీఎస్సీ కాదు - దగా డీఎస్సీ'!

Pamidhi: పామిడిలో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. 'ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ' అని మండిపడుతూ మంత్రి రాజీనామాకు డిమాండ్.

Update: 2026-08-10 07:02 GMT

Pamidhi: వైఎస్సార్‌సీపీ నిరసన ఇది 'మెగా డీఎస్సీ కాదు - దగా డీఎస్సీ'!

Pamidhi:  రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, గుంతకల్లు నియోజకవర్గ ఇంచార్జి వై. వెంకటరామిరెడ్డి ఆదేశాలతో పామిడి మండలంలో డిఎస్సీ అక్రమాలపై వైసిపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో పాల్గొన్న అనంతపురం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పెమ్మక చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ, "ఇది మెగా డిఎస్సీ కాదు, ఇది దగా డిఎస్సీ. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ ఆడుకుంటున్నారని" ఆరోపించారు.

డిఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి, రూరల్ కన్వీనర్ రామకృష్ణ నాయక్, విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ నాయకులు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ర్యాలీ అంతా "జగన్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి", "లోకేష్ దిగిరా" అంటూ నినాదాలు చేశారు.

Tags:    

Similar News