Pamidi: పామిడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి పడిన బస్సు!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు దగ్గరి NH-44పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వంతెనపై నుంచి కిందపడటంతో 20 మందికి గాయాలయ్యాయి.

Update: 2026-08-09 02:16 GMT

Pamidi: పామిడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి పడిన బస్సు!

పామిడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం - 20 మందికి గాయాలు

అనంతపురం: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు సమీపంలోని NH-44 జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న నవంబర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న ఐచర్ వాహనం ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి కిందకు పడిపోయింది. ఘటనలో బస్సులోని 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో సాయిలత, సారా, చరణ్, గణేష్, రఘురాం, ప్రవీణ్, ఫమీద, శరణ్య, బ్రహ్మయ్య, సుభాగి, వివేక్, ఉమేష్ తదితరులు ఉన్నారు.

వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఐచర్ డ్రైవర్‌తో పాటు బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News