Kadiri: కదిరి అమీన్ నగర్‌లో 'ఇంటింటికీ తెలుగుదేశం': ఎమ్మెల్యే పర్యటన!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి 6వ వార్డు అమీన్ నగర్‌లో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం నిర్వహించారు.

Update: 2026-08-07 15:07 GMT

Kadiri: కదిరి అమీన్ నగర్‌లో 'ఇంటింటికీ తెలుగుదేశం': ఎమ్మెల్యే పర్యటన!

కదిరి: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని 6వ వార్డు అమీన్ నగర్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఇంటింటికీ తెలుగుదేశం – డోర్ టు డోర్" కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు.

ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. స్థానికులు వినిపించిన తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి సమస్యలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

Tags:    

Similar News