Anantapur: శ్రీ అభయాంజనేయ స్వామి ఆధ్యాత్మిక వేడుకల కరపత్రాల ఆవిష్కరణ!
Anantapur: సోమలదొడ్డి శ్రీ అభయాంజనేయ స్వామి ధర్మకర్త ప్రమోద్ స్వామి ఆధ్వర్యంలో జరగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల కరపత్రాలను ఆధ్యాత్మికవేత్తలు ఆవిష్కరించారు.
Anantapur: శ్రీ అభయాంజనేయ స్వామి ఆధ్యాత్మిక వేడుకల కరపత్రాల ఆవిష్కరణ!
Anantapur: అనంతపురం నగరంలో 20027సంవత్సరం,జనవరి 29, 30, 31 వ తేదీలలో శ్రీ సోమలదొడ్డి శ్రీ అభయాంజనేయ స్వామి ధర్మకర్తలు పూజ్యశ్రీ ప్రమోద్ స్వామి ఆధ్వర్యంలో, లోక కళ్యాణార్థం రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో, జరగబోవు, ప్రతిరోజు, లక్షమంది హిందూ బంధువులచే,29వ తేదిన శ్రీ శివపంచాక్షరి నామస్మరణ, సద్గురువులు పీఠాధిపతుల ఆధ్యాత్మిక ప్రవచనములు.
30వ తేదీన శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం పూజ్య పీఠాధిపతుల ఆధ్యాత్మిక ప్రసంగం,31వ తేదీన
శ్రీ రామనామజపం తదుపరి, పూజ్య పీఠాధిపతులు, సద్గురువుల, ప్రవచనములు, ఆశీర్వాదంతో కార్యక్రమం ముగింపు,పై కార్యక్రమానికి నాందిగా, ఈ రోజు ఆత్మీయసమావేశంలో చిన్మయమిషన్ శ్రీ ఆత్మవిధానంద స్వామిజీ, శివకోటి శివస్వామీజీ ,కసాపురం శ్రీ బెల్డోనాస్వామిజీ సద్గురువులు, ఆధ్యాత్మికవేత్తల ఆధ్వర్యంలో బ్రోచర్ కరపత్రము ( ఆహ్వానిపత్రిక ) ఆవిష్కరణ.