Anantapur: అనంతపురంలో 'హర్ ఘర్ తిరంగా' విద్యార్థులతో కలిసి బీజేపీ ర్యాలీ!

Anantapur: బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ జరిగింది విద్యార్థులలో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.

Update: 2026-08-10 11:00 GMT

Anantapur: అనంతపురంలో 'హర్ ఘర్ తిరంగా' విద్యార్థులతో కలిసి బీజేపీ ర్యాలీ!

Anantapur: అనంతపురం నగరంలో ఈరోజు విద్యార్థులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి బిజెపి జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ అత్యంత కోలాహలంగా నిర్వహించబడింది.

జాతీయ మరియు రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ, మండల స్థాయిలోనూ ప్రతి ఏటా ఈ విధమైన కార్యక్రమాలను చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రజలలో, ముఖ్యంగా విద్యార్థి లోకంలో దేశభక్తిని మరియు దేశభావాన్ని పెంపొందించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం. గతం లోని విద్యాబోధనలో ఎక్కువగా మొఘలుల చరిత్ర, ఇతర రాజ్యాల చరిత్రకే ప్రాధాన్యత లభించిందని, మన స్వాతంత్ర్య పోరాటం మరియు దాదాపు 78 సంవత్సరాల స్వాతంత్ర్య సిద్ధికై ప్రాణాలర్పించిన యోధుల చరిత్ర పిల్లలకు సరిగ్గా తెలియని పరిస్థితి ఉండేదని ప్రతినిధులు పేర్కొన్నారు.

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వాతంత్ర్యోద్యమంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను విద్యార్థులకు తెలియజేసే దిశగా ప్రత్యేక సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.

ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి పెంపొందించేందుకు చేపట్టే ఇటువంటి 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీలు శుభపరిణామమని, ప్రతిచోటా ప్రజలందరూ భాగస్వాములై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News