Guntakal: వైకాపా నేత మల్లికార్జునను పరామర్శించిన నైరుతి రెడ్డి!
Guntakal: గుంతకల్లు మండలం కసాపురంలో హార్ట్ సర్జరీ చేయించుకున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు గంతుల మల్లికార్జునను జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి పరామర్శించారు.
Guntakal: వైకాపా నేత మల్లికార్జునను పరామర్శించిన నైరుతి రెడ్డి!
Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంతుల మల్లికార్జున హార్ట్ సర్జరీ చేయించుకున్న విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతి రెడ్డి సోమవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా గంతుల మల్లికార్జున ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కసాపురం గ్రామ మాజీ ఎంపీటీసీ గంతుల వెంకటరాముడు, సీనియర్ నాయకులు సోమిరెడ్డి, పోలింగ్ బూత్ రాష్ట్ర విభాగం నాయకులు వినోద్ కుమార్ రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు వంశీ యాదవ్, కసాపురం మాజీ వైస్ సర్పంచ్ మద్దిలేటి, గుంతకల్ నియోజకవర్గ సోషల్ మీడియా మాజీ కమిషనర్ జయరామి, కసాపురం విజయ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.