Dharmavaram: గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా: కత్తె కొట్టాల కాటమయ్య!

ధర్మవరం: ధర్మవరం మండలం పోతులనాగేపల్లి సర్పంచ్ స్థానానికి నేడు టీడీపీ బలపరిచిన కత్తె కొట్టాల కాటమయ్య నామినేషన్ వేశారు. కాటమయ్య నామినేషన్ సందర్భంగా మద్దతుగా గ్రామస్తులు తరలివచ్చారు. నామినేషన్ సందర్భంగా కాటమయ్య మాట్లాడుతూ సర్పంచ్ గా గెలిపిస్తే పోతులనాగేపల్లి పంచాయతీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వంతో కలిసి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. అంతేకాకుండా ప్రజలు గ్రామ నాయకుల సహకారంతో ఉత్తమ పంచాయతీగా నిలబెడతానని కాటమయ్య తెలిపారు.

Tags: