Kadiri: కదిరి మున్సిపల్ ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే కందికుంట ఆత్మీయ భేటీ!

కదిరి: సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని మదనపల్లి రోడ్డులో గల పీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో కదిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా, కౌన్సిలర్లుగా గెలుపొందిన కూటమి అభ్యర్థులతో పాటు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులతో కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గెలుపొందిన చైర్‌పర్సన్, కౌన్సిలర్లను అభినందించారు. ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరి సేవలను అభినందిస్తూ, కూటమి నాయకులు, కార్యకర్తలందరూ ఐకమత్యంతో ఉంటూ కదిరి పట్టణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, పోటీ చేసిన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలందరికీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు ప్రత్యేకంగా విందు భోజనం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భైరవ ప్రసాద్, టీడీపీ నాయకులు శ్రీ పవన్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త శ్రీ మొగల్ ఫారూఖ్, పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్,టీడీపి సీనియర్ నాయకులు మోపురి చంద్ర శేఖర్, స్వచ్ఛాంధ్ర కమిషన్ డైరెక్టర్ శ్రీమతి పర్వీన్ భాను, తనకల్లు మండల నాయకులు శంకర్ నాయుడు,మున్సిపల్ కౌన్సిలర్లు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: