Lepakshi: లేపాక్షి వీరభద్రస్వామిని దర్శించుకున్న విద్యాశ్రీష స్వామీజీ!
Lepakshi: చారిత్రక లేపాక్షి శ్రీ దుర్గా వీరభద్రస్వామి ఆలయాన్ని సోసలె వ్యాసరాయ మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీష స్వామీజీ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Lepakshi: లేపాక్షి వీరభద్రస్వామిని దర్శించుకున్న విద్యాశ్రీష స్వామీజీ!
లేపాక్షి: ప్రపంచ ప్రసిద్ధి చెందిన చారిత్రక లేపాక్షి శ్రీ దుర్గా వీరభద్రస్వామి ఆలయాన్ని సోసలె వ్యాసరాయ మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీష స్వామీజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పరిగి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో స్వామీజీ పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూర్ణకుంభం, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ కమిటీ చైర్మన్, అర్చకులు, సిబ్బంది స్వామీజీకి ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామీజీ శ్రీ దుర్గా వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పరిగి వేణుగోపాలరావు ఆలయంలోని పాపనాశేశ్వర స్వామి, శ్రీ వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ఆలయాల విశిష్టతను స్వామీజీకి వివరించారు. అలాగే లేపాక్షి ఆలయ చారిత్రక ప్రాశస్త్యం, అపురూప శిల్పకళా సంపద, ఆలయ నిర్మాణ విశేషాలను తెలియజేశారు. స్వామీజీ ఆసక్తిగా ఆలయ చరిత్ర, విశేషాలను తెలుసుకున్నారు.